ఇంజనీరింగ్‌ విద్యార్థుల విహారయాత్రలో విషాదం








 మునగాల(కోదాడ): విహారయాత్ర విషాదాంతమైంది. అతివేగానికి ముగ్గురు విద్యార్థులు బలయ్యారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో గల గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న 16 మంది విద్యార్థులు ఆదివారం గుంటూరు జిల్లా బాపట్లకు రెండు కార్లలో వెళ్లారు. రోజంతా అక్కడ ఎంతో సంతోషంగా గడిపారు. తిరుగు పయనంలో మార్గమధ్యలో విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని వస్తున్నారు. మునగాల మండలం ఇంది రానగర్‌ శివారు వద్దకు రాగానే వీరి ఓ కారు ముందున్న లారీని ఢీకొట్టి ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బాలాపూర్‌కు చెందిన హర్ష (24), చంపాపేట్‌కు చెందిన రేవంత్‌(24), సికింద్రాబాద్‌కు చెందిన శశాంక్‌(26) మృతిచెందారు.