గంగూలీ పదవీ కాలం మూడేళ్లు కాబోతుందా?

ముంబై: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సౌరవ్‌ గంగూలీ అప్పుడే తన మార్కు 'ఆట'ను మొదలుపెట్టేశాడు. భారత క్రికెట్‌ జట్టు తొలిసారి డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడటం ఒకటైతే, అలాగే కోట్లాది రూపాయిల ఖర్చుతో జరిగే ఐపీఎల్‌ వేడుకల్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలు గంగూలీ తీసుకున్నాడు. అయితే గంగూలీ పదవీ కాలం తొమ్మిదినెలలే కావడంతో భారత క్రికెట్‌లో మార్పుకు అది సరిపోదని పాలకవర్గం భావిస్తోంది. కనీసం మూడేళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉంటే భారత క్రికెట్‌ రూపు రేఖలు మార్చగలడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.